Home  »  TV News  »  ముక్కుపుడక-త్రినయని మహాసంగమం

Updated : Jul 20, 2022

సరికొత్త కంటెంట్ తో మరియు వినూత్నమైన ప్రయోగాలు చేయడంలో 'జీ తెలుగు' ఎల్లప్పుడూ ముందుంటుంది. గత కొంతకాలంగా వరుస మహాసంగమం ఎపిసోడ్స్ తో మీ ముందుకు వస్తున్న ఈ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఇప్పుడు బోనాలు పండగ సందర్బంగా మరో సర్ప్రైజ్ తో ప్రేక్షకులను కనువిందు చేయనుంది. అదే ముక్కుపుడక మరియు త్రినయని మహాసంగమం. జూలై 20 న (బుధవారం) రాత్రి 8 నుండి 9 గంటల వరకు ప్రసారం కానున్న ఈ మెగా ఎపిసోడ్ ఆధ్యాంతం పలు మలుపులతో ఉత్కంఠభరితంగా సాగనుంది. ఇక కథ విషయానికొస్తే, నయని, సుమన, హాసిని మరియు వారి కుటుంబసభ్యులు అమ్మవారి గుడిలో వేదవతి మరియు కుటుంబసభ్యులకు ఎదురుపడడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. అదే సమయంలో, శ్రీకర్ మరియు అవని కూడా బోనాల ఉత్సవాలను వీక్షించేందుకు గుడికి వస్తారు.

అయితే, ఎప్పటినుండో అవనిపై పగతీర్చుకోవాలని ఎదురుచూస్తున్న సురేంద్ర అవనిని గుడికి వద్ద చూడగానే, తన చీరకు నిప్పంటించి చంపాలని నిశ్చయించుకుంటాడు. మరోవైపు కడుపుతో ఉన్న నయని ని ఎలాగైనా చంపాలని తిలోత్తమ పన్నాగం పన్నుతోంది. అయితే, వీరిద్దరిని సురేంద్ర మరియు తిలోత్తమల నుండి ఎవరు కాపాడుతారన్నదే ముఖ్యాంశంగా కథ సాగుతుంది. 'త్రినయని' అద్భుతమైన కథాంశంతో జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రముఖ సీరియల్స్ లో ఒకటిగా నిలిచి ప్రేక్షకుల మన్ననలను పొందుతుండగా, ఇటీవలే మొదలయినప్పటికీ 'ముక్కుపుడక' రిలేటబుల్ కుటుంబ కథాంశంతో వీక్షకుల మనస్సులను గెలుచుకుంటుంది. ఈ రోజు సాయంత్రం (జూలై 20 బుధవారం) రాత్రి 8 నుండి 9 గంటల వరకు ముక్కుపుడక-త్రినయని మహాసంగామం ఎపిసోడ్ ని తప్పక వీక్షించండి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.